సాహో ఎఫెక్ట్... టాలీవుడ్ లో ఒకే రోజు 10 సినిమాలు రిలీజ్!
Advertisement
టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతుండడం ఎప్పట్నించో ఆనవాయితీగా వస్తోంది. వీకెండ్ లో సినిమా విడుదల అయితే ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడతాయన్నది నిర్మాతల నమ్మకం. చిన్న నిర్మాతలైతే పెద్ద సినిమాల రిలీజ్ తో పోటీపడకుండా సురక్షిత మార్గం ఎంచుకుంటారు. పెద్ద సినిమాకు ముందు రిలీజ్ చేయడమో, లేక తర్వాత తీసుకురావడమో చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో సాహో మేనియా నడుస్తుండడంతో ఈ శుక్రవారం ఏకంగా 10 సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

సాహో ఆగస్టు 30న వస్తుండడంతో, చిన్న సినిమాలన్నీ వారం రోజుల ముందే సందడి చేయనున్నాయి. ఆగస్టు 23న చిన్న సినిమాల పండుగ అని చెప్పాలి. కౌసల్య కృష్ణమూర్తి, నేనే కేడీ నెం.1, జిందా గ్యాంగ్, నీతోనే హాయ్ హాయ్, ఏదైనా జరగొచ్చు, బాయ్, ఉండిపోరాదే, కనులు కనులు దోచెనే, నివాసి, హవా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటిలో ఎన్ని ప్రజాదరణకు నోచుకుంటాయన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
Tue, Aug 20, 2019, 03:03 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View