రేపు వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
Advertisement
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా నదికి వరదలు రావడంతో అనేక ప్రాంతాలు నీట మునిగి, వేలమంది ప్రజలు తీవ్ర అవస్థల పాలయ్యారు. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను టీడీపీ అధినేత పరామర్శించనున్నారు. వరద బాధితులతో మాట్లాడతారు. 
Mon, Aug 19, 2019, 09:18 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View