నాని కోసం ట్రై చేస్తోన్న హను రాఘవపూడి
Advertisement
హను రాఘవపూడి పేరు వినగానే నాని హీరోగా ఆయన తెరకెక్కించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' గుర్తుకు వస్తుంది. అంతగా ఈ సినిమా దర్శకుడిగా ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత ఆయన చేసిన 'లై' .. 'పడి పడి లేచే మనసు' చిత్రాలు రెండూ అంతగా ఆదరణ పొందలేదు.

దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఒక కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ కథను నానీకి వినిపించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. ఇక ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన 'వి' సినిమాను పూర్తి చేయవలసి వుంది. ఈ సినిమాల తరువాత ఆయన హను రాఘవపూడితో కలిసి సెట్స్ పైకి వెళతాడా? లేదా? అనేది తెలుస్తుంది. 
Mon, Aug 19, 2019, 06:41 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View