'సాహో'కు, ప్రభాస్ కు వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వస్తున్న కథనాలపై నారా లోకేశ్ ఆగ్రహం
Advertisement
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ వెబ్ సైట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాహో, ప్రభాస్ కు వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేస్తోందంటూ ఆ వెబ్ సైట్ లో ఓ కథనం వచ్చింది. ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో జగన్ పాలనను మెచ్చుకోవడంతో టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోందని, అందుకే సాహో రిలీజ్ వేళ ప్రభాస్ ను టార్గెట్ చేసుకుని నెగెటివ్ ప్రచారం చేస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు. దీనిపై నారా లోకేశ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ అబద్ధాలు రాసిన కుహనా జర్నలిస్టు సిగ్గుపడాలని అన్నారు. కుల విభజన, విద్వేష వ్యాప్తితో సంపాదించిన సొమ్ముతో తిండి ఎలా తింటున్నారు? అంటూ నిప్పులు చెరిగారు. మీకు మనస్సాక్షి అనేదే లేదా? అంటూ నిలదీశారు.

"అయినా సాహో ఓ భారీ బడ్జెట్ చిత్రం. ఈ అద్భుతమైన సినిమాను చూడ్డానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ లాగా నేను కూడా ఉవ్విళ్లూరుతున్నాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సాహో చిత్రాన్ని ప్రభాస్ ఫ్యాన్సే కాదు, టీడీపీ మద్దతుదారులు కూడా వీక్షించి ఆ పనికిమాలిన కథనాన్ని విసిరికొట్టండి" అంటూ ట్వీట్ చేశారు.
Mon, Aug 19, 2019, 06:17 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View