'ఉప్పెన' కోసం రంగంలోకి దిగిన విజయ్ సేతుపతి
Advertisement
సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'ఉప్పెన' రూపొందుతోంది. ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. సముద్రతీర ప్రాంతంలోని జాలరుల కుటుంబాలకి చెందిన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో కథానాయిక తండ్రిగా ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.

ఇటీవలే కాకినాడలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగును జరుపుకుంది. రెండవ షెడ్యూల్ షూటింగును హైదరాబాద్ - సారథి స్టూడియోలో ప్లాన్ చేశారు. ఇక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగు జరుగుతోంది. ఈ రోజున ఈ సినిమా షూటింగులో విజయ్ సేతుపతి జాయిన్ అయ్యాడు. ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలనే వరుసగా చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఈ సినిమా ద్వారా కృతి శెట్టి కథానాయికగా పరిచయం కానుంది.  
Mon, Aug 19, 2019, 05:53 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View