'కౌసల్య కృష్ణమూర్తి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ - రాశి ఖన్నా
19-08-2019 Mon 13:01
- క్రికెట్ నేపథ్యంలో సాగే 'కౌసల్య కృష్ణమూర్తి'
- ప్రధాన పాత్రధారిగా ఐశ్వర్య రాజేశ్
- ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రికెట్ నేపథ్యంలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాను రూపొందించారు. ఐశ్వర్య రాజేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ లోని జెఆర్సీ బాల్ రూమ్ లో రేపు సాయంత్రం ఈ వేడుకను జరపనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ - రాశి ఖన్నా హాజరవుతారు.
ఓ కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించగా, ప్రత్యేకమైన పాత్రలో శివకార్తికేయన్ కనిపించనున్నాడు. తమిళంలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్, ఈ సినిమాతో తెలుగులోను తన కెరియర్ జోరందుకుంటుందని భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
ADVERTSIEMENT
More Telugu News
చివరి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన ఆర్సీబీ
43 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
55 minutes ago

'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!
1 hour ago
