'ఎవరు' నాకు తెగ నచ్చేసింది: అల్లు అర్జున్
Advertisement
అడివి శేష్ కథానాయకుడిగా ఇటీవల థియేటర్లకు వచ్చిన 'ఎవరు' సినిమా, తొలి రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 'ఎవరు' చూసిన ఇండస్ట్రీ ప్రముఖులు, ఈ సినిమా టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు.

'ఎవరు' సినిమాను గత రాత్రి చూశాను. అనూహ్యమైన మలుపులతో ఈ సినిమా ఆసక్తికరంగా సాగిపోయింది. అడివి శేష్ వరుసగా మంచి సినిమాలను చేస్తూ వెళుతున్నాడు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగిన ఈ సినిమా నాకు బాగా నచ్చేసింది. అడివి శేష్ .. రెజీనా .. నవీన్ చంద్ర .. మురళీశర్మ చాలా బాగా చేశారు. దర్శక నిర్మాతలతో పాటు ఈ చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు. 'ఎవరు' తనకి బాగా నచ్చేసిందని బన్నీ చెప్పడం, ఈ సినిమా జోరు మరింతగా పెరగడానికి దోహదం చేస్తుందని చెప్పుకుంటున్నారు.
Mon, Aug 19, 2019, 11:38 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View