సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన.. నిల్చోవాల్సిన పనిలేదన్న విద్యాబాలన్
Advertisement
సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపనపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. సినిమా ప్రదర్శనకు ముందు హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించేటప్పుడు ప్రేక్షకులు అందరూ తప్పకుండా లేచి నిల్చోవాలన్న నిబంధన ఉంది. అలా నిల్చోని వారిపై కేసులు నమోదైన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ ఏకీకరణ, సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనపై బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను అడిగిన ప్రశ్నకు ఆమె నిక్కచ్చిగా సమాధానం చెప్పారు.

జాతీయవాదం సినిమాల్లో ఉండాలి తప్పితే సినిమా హాళ్లలో ఉండాల్సిన అవసరం లేదని విద్యాబాలన్ తేల్చి చెప్పారు. సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని వేసే సమయంలో లేచి నిల్చోవాల్సిన పనిలేదన్నారు. భారతీయులు గర్వించే అంశాలు చాలానే ఉన్నాయని అన్నారు. విదేశాలు వెళ్లినప్పుడు భారత్ ఎంత గొప్పదో మనకు బోధపడుతుందన్నారు. ఇక్కడి సహజ సిద్ధమైన అందాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతీ సంప్రదాయాలు చాలానే ఉన్నాయని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. కాబట్టి మనం సంతోషించే, గర్వించే అంశాలు చాలానే ఉన్నాయని విద్యాబాలన్ వివరించారు.
Mon, Aug 19, 2019, 09:21 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View