సాహో ప్రీరిలీజ్ ఈవెంట్... ప్రభాస్ నామస్మరణతో మార్మోగుతున్న రామోజీ ఫిలింసిటీ
Advertisement
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. గత కొన్నిరోజుల నుంచే ఈ కార్యక్రమం సందడి మొదలైంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు వేదికగా నిలిచిన రామోజీ ఫిలింసిటీ వెలుపల 60 అడుగుల ప్రభాస్ కటౌట్ ఏర్పాటు చేశారు. అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో రామోజీ ఫిలింసిటీ జనసంద్రాన్ని తలపిస్తోంది. ప్రభాస్ నామస్మరణతో ఫిలింసిటీ హోరెత్తిపోతోంది.

కాగా, ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రధ్దా కపూర్, సాహో దర్శకుడు సుజీత్, నటుడు అరుణ్ విజయ్, టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు వీవీ వినాయక్ తదితరులు హాజరయ్యారు.
Sun, Aug 18, 2019, 09:16 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View