మేం వరద బాధితులను మినరల్ వాటర్ అడిగామన్నది అబద్ధం: మోపిదేవి వెంకటరమణ
Advertisement
కృష్ణా నది వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ ప్రజాప్రతినిధులు కిన్లే మినరల్ వాటర్ బాటిల్ కావాలని గ్రామస్తులను అడిగినట్టు జరుగుతున్న ప్రచారంపై మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ముఖ్యంగా, తాను కిన్లే మినరల్ వాటర్ కావాలని వరద బాధితులను అడిగినట్టు వస్తున్న కథనాల పట్ల ఆయన మండిపడ్డారు. కొందరు టీడీపీ నేతలు, కొన్ని మీడియా చానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే లీగల్ చర్యలకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. పెసరలంక గ్రామంలో తాము వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
Sun, Aug 18, 2019, 08:45 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View