కోహ్లీనే సోషల్ మీడియా కింగ్... ప్రతి సోషల్ మీడియా సైట్లోనూ 30 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఏకైక క్రికెటర్
Advertisement
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు బయట కూడా రికార్డుల మోత మోగిస్తున్నాడు. బ్యాట్ తో పరుగుల వర్షం కురిపించే ఈ ఢిల్లీ డైనమైట్ సోషల్ మీడియాలో ఫాలోవర్ల పరంగానూ ముందంజలో ఉన్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఎంతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతి సోషల్ మీడియా వెబ్ సైట్ లోనూ కోహ్లీకి ఒక్కోదాంట్లో 30 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ సైట్లలో ఈ ఘనత సాధించిన క్రికెటర్ కోహ్లీ ఒక్కడే.

కోహ్లీకి ట్విట్టర్ లో 31 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 39.2 మిలియన్లు, ఫేస్ బుక్ లోనూ 37 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ విషయంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉండగా, వికెట్ కీపింగ్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ మూడోస్థానంలో ఉన్నాడు.
Sun, Aug 18, 2019, 06:27 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View