ఉద్యోగాల పేరిట మహిళలకు మోసం.. ఓ నిందితుడి అరెస్టు
Advertisement
పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యోగాల పేరిట మహిళలను ఓ ముఠా మోసం చేస్తోంది. ఈ మేరకు బాధిత మహిళ మొగల్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మొగల్తూరుకు చెందిన నిందితుడు బొండా వెంకటసుబ్బారావును అరెస్టు చేశారు. పాలకొల్లుకు చెందిన ఆకుమర్తి జ్యోతిని కీలక నిందితురాలుగా గుర్తించారు. దుబాయ్ లోనే ఉంటున్న జ్యోతి ఈ మోసాలకు పాల్పడుతోందని, దుబాయ్ లో చిక్కుకున్న ముగ్గురు మహిళలను క్షేమంగా తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు.
Sun, Aug 18, 2019, 03:56 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View