జవానును కోల్పోయి 24 గంటలు గడవకముందే పాకిస్థాన్ ను దెబ్బకొట్టిన భారత్
Advertisement
జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్ లో ఈ ఉదయం పాకిస్థాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులు జరుపగా, సందీప్ థాపా అనే భారత జవాను వీరమరణం పొందాడు. తమ జవాను ప్రాణాలు కోల్పోయిన కొన్ని గంటల్లోనే భారత్ ప్రతీకారం తీర్చుకుంది. రాజౌరీ సెక్టార్ కు సమీపంలో పాకిస్థాన్ భూభాగంలో ఉన్న ఓ సైనిక పోస్టును భారత బలగాలు నేలమట్టం చేశాయి. ఈ ఘటనలో పలువురు పాక్ సైనికులు హతులై ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఇరు పక్షాల మధ్య భీకర పోరు సాగుతోంది.
Sat, Aug 17, 2019, 10:04 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View