రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు ప్రకటించిన కేంద్రం
Advertisement
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. అర్జున అవార్డు సెలక్షన్ కమిటీ కేంద్రానికి ప్రతిపాదించిన 19 మందిలో జడేజా కూడా ఉన్నాడు. మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్, అథ్లెటిక్స్ క్రీడాకారులు తేజిందర్ పాల్ సింగ్ థూర్, మహ్మద్ అనాస్, స్వప్న బర్మన్ లతో పాటు ఫుట్ బాల్ ప్లేయర్ గుర్ ప్రీత్ సింగ్ సంధూ, హాకీ ఆటగాడు చింగ్లెన్ సానా కంగుజామ్, షూటర్ అంజుమ్ మౌద్గిల్ కూడా అర్జున జాబితాలో ఉన్నారు.

అర్జున అవార్డు కోసం బీసీసీఐ ఈ ఏడాది రవీంద్ర జడేజాతో పాటు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ ల పేర్లను నామినేట్ చేసింది. అయితే వీరిలో జడేజా, పూనమ్ యాదవ్ లను మాత్రమే అర్జున అవార్డు వరించింది. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో జడేజా ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అతడిని అర్జున రేసులో ముందు నిలిపింది. న్యూజిలాండ్ తో సెమీస్ పోరులో జడేజా 59 బంతుల్లోనే 79 పరుగులు సాధించి కివీస్ ను హడలెత్తించాడు.
Sat, Aug 17, 2019, 08:38 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View