లావుగా ఉన్నావ్, ఐస్ క్రీమ్ తినొద్దన్న బాయ్ ఫ్రెండ్ ను చంపేసిన యువతి
Advertisement
చైనాలో ఘోరం జరిగింది. ఐస్ క్రీమ్ తిననివ్వడంలేదని ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ ను చంపేసింది. హెనాన్ ప్రావిన్స్ లో ఝుమాదియన్ నగరంలో వాంగ్ అనే యువతి ఝాంగ్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. గత 20 రోజుల నుంచి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అయితే ఈ జోడీ ఫెంగ్వాంగ్ రోడ్డులో షాపింగ్ చేస్తున్న సమయంలో వాంగ్ కు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. వాంగ్ అప్పటికే అధికబరువుతో ఉందని ఆమె ప్రియుడు బాధపడుతుండేవాడు. ఐస్ క్రీమ్ తింటే మరింత లావు అవుతుందని భావించి ఆమెను ఐస్ క్రీమ్ తిననివ్వలేదు.

దాంతో ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. పక్కనే ఓ దుకాణంలో కత్తెర కొనుక్కుని వచ్చి తన బాయ్ ఫ్రెండ్ ను కసిదీరా పొడిచింది. తీవ్రగాయాలపాలైన ఝాంగ్ కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించినా అతడి ప్రాణాలు నిలవలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Sat, Aug 17, 2019, 04:25 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View