పోలవరం ప్రాజెక్టు పనులకు రూ. 4,900 కోట్లకు రివర్స్ టెండర్లను పిలిచిన ఏపీ ప్రభుత్వం
Advertisement
పోలవరం ప్రాజెక్టు పనులకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం రూ. 4,900 కోట్లతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభంచింది. ఇందులో హెడ్ వర్క్ పనులకు రూ. 1,800 కోట్లు, హైడల్ ప్రాజెక్టు పనులకు రూ. 3,100 కోట్ల అంచనాలతో టెండర్ల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించింది. గతంలో అంచనాలను భారీగా పెంచారని ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు, రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దంటూ కేంద్ర జల వనరుల శాఖ చేసిన సూచనలను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది.
Sat, Aug 17, 2019, 04:25 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View