అప్పుడు నా జేబులో రూ.200 కూడా లేవు.. ఇప్పుడు మాత్రం చాలా: నటుడు అక్షయ్ కుమార్
Advertisement
తాను బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పుడు తన జేబులో 200 రూపాయలు కూడా లేవని, కానీ ఈ రోజు చాలా ఉందని బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నాడు. అక్షయ్ నటించిన ‘మిషన్ మంగళ్’ సినిమా రేపు విడుదల కానుంది. భారత అంతరిక్ష పరిశోధనలపై వస్తున్న తొలి సినిమా ఇది. ఇస్రో మార్స్ ఆర్బిట్ మిషన్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

‘మిషన్ మంగళ్’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో  అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో తన తొలి రోజులను గుర్తు చేసుకున్నాడు. ఫెయిల్యూర్స్‌ను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు అక్షయ్ బదులిస్తూ.. తాను చాలా కిందిస్థాయి నుంచి వచ్చానని పేర్కొన్నాడు. ఎన్నో కష్టనష్టాలను అనుభవించే ఈ రోజు ఈ స్థాయికి వచ్చానన్నాడు. కనీసం మూడునాలుగు సార్లు తన సినీ కెరియర్‌లో ఎత్తుపల్లాలను చూశానన్నాడు.

‘‘బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు నా జేబులో కనీసం రూ.200 కూడా లేవు. కానీ ఈ రోజు చాలా ఉంది. నేను చాలా కింది నుంచి వచ్చిన వాడిని. ఎత్తుపల్లాలు నాకు కొత్త కాదు. నా ఇంటిని, కార్లను చూసుకున్నప్పుడు దేవుడు ఎంత దయగలవాడా అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను తక్కువ అని అనుకోవడం లేదు’’ అని అక్షయ్ కుమార్ పేర్కొన్నాడు.
Wed, Aug 14, 2019, 10:04 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View