ఇండియాలో పాకిస్థాన్ సానుభూతిపరులు ఎందరో ఉన్నారు... ప్రముఖుల పేర్లు చెప్పి కలకలం రేపిన పాక్ రాజకీయ నాయకుడు ముషాహిద్ హుస్సేన్!
Advertisement
పాకిస్థాన్ సీనియర్ రాజకీయ నాయుకుడు ముషాహిద్ హుస్సేన్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియాలో పాకిస్థాన్ సానుభూతిపరులు ఎందరో ఉన్నారని చెబుతూ, ఆయన పలువురు ప్రముఖుల పేర్లను వెల్లడించడమే ఇందుకు కారణం. ఇండియాలోని అందరూ ప్రధాని నరేంద్ర మోదీ వెంటలేరని, వందలాది మంది పాక్ కు మద్దతిచ్చేవారున్నారని ఆయన అంటున్నారు.

ఇక, జియో టీవీలో ప్రసారమైన ఈ వీడియోలో "ఇండియన్స్ అందరూ మోదీతోనే లేరు. రచయిత అరుంధతీ రాయ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో ఎందరో పాక్ సానుభూతిపరులుగా ఉన్నారు" అని ఆయన అన్నారు. ఇండియాతో జరుగుతున్నది దీర్ఘకాలిక యుద్ధమని, ఓ పెద్ద దేశమైన ఇండియాలో ఎంతో మంది ప్రజలు పాక్ వైపున్నారని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Wed, Aug 14, 2019, 10:02 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View