2019 భారత్ ఎన్నికలపై తొలిసారి డాక్యుమెంటరీ.. రేపు ప్రసారం చేయనున్న నేషనల్ జియోగ్రఫీ చానల్
Advertisement
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలపై నేషనల్ జియోగ్రఫీ చానల్ తొలిసారి ఓ డాక్యుమెంటరీని చిత్రీకరించింది. ఎన్నికల వెనక కథలు, సమాహారాలతో ఆకట్టుకునేలా దీనిని రూపొందించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు దీనిని ప్రసారం చేయనుంది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, సిబ్బంది పడిన కష్టాలు ఈ డాక్యుమెంటరీ ద్వారా బయటి ప్రపంచానికి తెలియనున్నాయి.

సెక్యూరిటీ సిబ్బంది విధులు, ఎన్నికల్లో వారు ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా చూపించనుంది. దీంతోపాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు పడిన కష్టాలను, ఇప్పటి వరకు బయటికి రాని ఫుటేజీలను ప్రజల కళ్ల ముందు ఉంచనుంది. భారత ఎన్నికలపై ఇది తొలి డాక్యుమెంటరీ కావడంతో అందరిలోనూ దీనిపై ఆసక్తి నెలకొంది.
Wed, Aug 14, 2019, 09:27 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View