పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. వరద ముప్పులో చంద్రబాబు నివాసం
Advertisement
ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలోని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నివాసానికి వరద ముప్పు ఏర్పడింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది. దీనిని ఆనుకుని నిర్మించిన అనేక నిర్మాణాల్లోకి ఇప్పటికే వరద నీరు చేరింది. చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్‌హౌస్ మెట్ల వరకు నీరు చేరుకోవడంతో ఆందోళన మొదలైంది. పులిచింతల నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని వదిలితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది.  

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండడంతో 5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఫలితంగా కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది.
Wed, Aug 14, 2019, 08:37 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View