మైకంలో యువజంట... ముద్దాడుతూనే మృత్యుఒడిలోకి... వీడియో!
Advertisement
ఆహ్లాదకర వాతావరణం.. పక్కనే ప్రియురాలు లేదా ప్రాణంగా ప్రేమించే జీవిత భాగస్వామి ఉంటే, హద్దులు దాటి ఆకాశానికి ఎగిరేయాలనిపిస్తుంది. అలానే ప్రేమ పారవశ్యంలో మునిగిన ఓ జంట ప్రమాదవశాత్తూ ప్రాణాలు విడిచిన దురదృష్టకర ఘటన పెరూలోని బెత్లహాం వంతెనపై జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమై, ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

పెరూకు చెందిన దంపతులు ఎస్పినోజ్‌ (34), హెక్టర్‌ విడాల్‌ (36)లు, టూరిస్టు గైడ్‌ లుగా పనిచేస్తున్నారు. పని నిమిత్తం క్యూసో పట్టణానికి వచ్చి, ఆపై తిరుగు ప్రయాణంలో బెత్లెహాం బ్రిడ్జిపై కాసేపు సేదదీరారు. తన్మయత్వంతో ముద్దుల్లో మునిగారు. అదే సమయంలో ఎస్పినోజ్‌ తన భర్తను మరింత దగ్గరగా లాక్కునేందుకు ప్రయత్నించింది. దీంతో బ్యాలెన్స్ తప్పి, ఇద్దరూ రక్షణ గోడపై నుంచి 50 మీటర్ల దిగువకు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుంటే ఎస్పినోజ్‌, చికిత్స పొందుతూ విడాల్‌ మరణించారు. పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.
Wed, Aug 14, 2019, 08:27 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View