తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఫైన్!
Advertisement
మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేసే అంశంపై నివేదిక పంపించాలని ఎన్నిసార్లు ఆదేశించినా పట్టించుకోని ఏడు రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు నివేదిక ఇవ్వడంలో విఫలమయ్యాయంటూ రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానా విధించింది.

రాష్ట్రాల్లో మానవ హక్కుల ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిందిగా 2018లోనే అత్యున్నత ధర్మాసనం సూచించింది. ఈ కేసు నిన్న వాదనలకు రాగా, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ బీఆర్‌ దవైల ధర్మాసనం విచారించింది. రాజస్తాన్‌. ఉత్తరాఖండ్‌ ల తరఫున కనీసం న్యాయవాదులు కూడా హాజరు కాకపోవడంతో ఆ రాష్ట్రాలకు లక్ష రూపాయల చొప్పున, మిగతా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరాంలకు రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. మరో నాలుగు వారాల్లోగా తమ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.
Wed, Aug 14, 2019, 08:24 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View