చైనాలో రజనీకాంత్ సినిమా ప్రభంజనం
Advertisement
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సీక్వెల్ 2.ఓ సినిమా చైనాలోనూ విడుదల అవుతోంది. అది కూడా రికార్డు స్థాయిలో. సెప్టెంబరు 6న చైనాలో ఈ చిత్రం 47,000 కంటే ఎక్కువగా త్రీడీ స్క్రీన్లపై రిలీజ్ అవుతోంది. ఈ రేంజ్ లో చైనాలో రిలీజవుతున్న విదేశీ చిత్రం ఇప్పటివరకు మరొకటి లేదు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ, హెచ్ వై మీడియా సంస్థతో కలిసి 2.ఓ చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తోంది.  ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీ జాక్సన్ నటించగా, ఎంతో కీలకమైన ప్రతినాయక పాత్రను బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పోషించారు.  వాస్తవానికి ఈ చిత్రాన్ని జూలై 12నే రిలీజ్ చేయాలని భావించినా, హాలీవుడ్ మూవీ ది లయన్ కింగ్ విడుదల నేపథ్యంలో వాయిదా వేశారు.
Tue, Aug 13, 2019, 10:04 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View