మరో వ్యాపారంలో అడుగుపెట్టిన ధోనీ
Advertisement
ప్రస్తుతం కశ్మీర్ లోయలో పారామిలిటరీ దళాలతో కలిసి విధులు నిర్వర్తిస్తున్న టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త వ్యాపార భాగస్వామితో జట్టుకట్టాడు. కార్స్24 అనే సంస్థలో పెట్టుబడి పెట్టడమే కాకుండా, ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరించనున్నాడు. ధోనీ భాగస్వామ్యంతో దేశంలో తమ బ్రాండ్ ను మరింత విస్తరించే అవకాశాలు కలిగాయని కార్స్24 యాజమాన్యం పేర్కొంది. ఈ విషయమై ధోనీ స్పందిస్తూ, కార్స్24తో చేయి కలపడం సంతోషదాయకం అని పేర్కొన్నాడు. సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చే కొత్త సంస్థలకు తాను ప్రోత్సాహం అందిస్తానని, కార్స్24 కూడా అలాంటి సంస్థేనని చెప్పాడు.
Tue, Aug 13, 2019, 08:34 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View