అప్పట్లో పరుచూరి బ్రదర్స్ కథలు చెబుతుంటే నవ్వేవాడ్ని... కారణం ఇదే: పవన్ కల్యాణ్
Advertisement
జనసేనాని పవన్ కల్యాణ్ 'మన సినిమాలు, అనుభవాలు, చరిత్ర, పరిణామం' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ ఫిలించాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన పవన్ మాట్లాడుతూ, తనపై పరుచూరి బ్రదర్స్ కు ఎప్పట్నించో ఓ కినుక ఉండేదని, ఈ సభలో వారికి అసలు విషయం చెబుతానని పేర్కొన్నారు. అప్పట్లో తన సోదరుడు చిరంజీవికి కథలు చెప్పేందుకు పరుచూరి బ్రదర్స్ వచ్చేవాళ్లని, వాళ్లు కథలు చెబుతుంటే తాను నవ్వేవాడ్నని తెలిపారు. తాను నవ్వడంతో పరుచూరి సోదరులకు ఏమైనా కోపం వచ్చి ఉండొచ్చని, అయితే అప్పుడు తాను జరగబోయే సీన్ ను ముందుగానే ఊహించి నవ్వేవాడ్నే తప్ప, వారిని కించపర్చాలని కాదని స్పష్టం చేశారు. తనకు మామూలుగానే ఊహాశక్తి అధికంగా ఉండేదని, పరుచూరి బ్రదర్స్ సీన్లు చెబుతుంటే తర్వాత సీన్ ఇలా ఉంటుందని ముందే గెస్ చేసి నవ్వేవాడ్ని తప్ప అందులో మరో ఉద్దేశం లేదని వివరించారు.
Tue, Aug 13, 2019, 07:28 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View