పళని వెళ్లి వచ్చిన నిఖిల్ టీమ్!
Advertisement
నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని చందూ - నిఖిల్ అనుకుంటూనే వున్నారుగానీ కుదరలేదు. ఇటీవల కాలంలో సరైన హిట్ కోసం ఇటు చందూ .. అటు నిఖిల్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'కార్తికేయ 2' చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైనట్టుగా కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

ఆ వార్తలు నిజమేనని ఇప్పుడు స్పష్టమైంది. చందూ - నిఖిల్ త్వరలోనే 'కార్తికేయ 2' షూటింగును మొదలెట్టనున్నారట. అందువలన ముందుగా 'పళని' వెళ్లి అక్కడి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని ఆ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సందర్భంలో దిగిన ఫోటోను నిఖిల్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకి నిర్మాతలుగా  వ్యవహరించనున్నారు.
Tue, Aug 13, 2019, 06:37 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View