అజిత్ దర్శకుడితో సూర్య సినిమా
Advertisement
తమిళ దర్శకులలో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల జాబితాలో శివ కూడా స్థానం సంపాదించాడు. అజిత్ తో ఆయన చేసిన సినిమాలు వరుస విజయాలను సాధించాయి. అజిత్ క్రేజ్ ను ఒక్కోమెట్టు పైకెక్కిస్తూ వెళ్లాడు. అజిత్ అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో సూర్య దృష్టి శివపై పడినట్టుగా సమాచారం.

కొంత కాలంగా వరుస పరాజయాలతో సూర్య సతమతమవుతున్నాడు. శివ దర్శకత్వంలో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కథను సిద్ధం చేయమని సూర్య చెప్పాడట. ప్రస్తుతం అదే పనిలో శివ వున్నట్టుగా సమాచారం. సూర్య తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'కాప్పన్' రానుంది. ఈ సినిమా విడుదల తరువాత సూర్య - శివ కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా జ్ఞానవేల్ రాజా వ్యవహరించనున్నాడని అంటున్నారు. 
Tue, Aug 13, 2019, 06:16 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View