టెండర్ల రద్దుపై స్పందించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ
హైదరాబాద్ లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం, ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుపై స్పందించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు పూర్తి చేసే సమయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని అభిప్రాయపడింది. రివర్స్ టెండరింగ్ తో ఎంత ఖర్చు పెరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని, కాంట్రాక్టు ఏజెన్సీల పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొంది.

‘పోలవరం’పై సమగ్ర నివేదిక అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఈ మేరకు ఆదేశించారు. తుదినిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఈ అంశాలన్నీ పరిగణించాలని, టెండర్ల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందేనని, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదన్నదే తమ అభిప్రాయమని అథారిటీ పేర్కొంది.
Tue, Aug 13, 2019, 05:41 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View