బన్నీ తాజా సినిమా టైటిల్ గా 'వైకుంఠపురంలో'?
Advertisement
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తాజా చిత్రం రూపొందుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. 'నేను - నాన్న' అనే టైటిల్ పరిశీలనలో వున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీన టైటిల్ ను ప్రకటించనున్నట్టు ట్విట్టర్ ద్వారా త్రివిక్రమ్ తెలియజేశాడు.

ఈ సినిమాకి 'వైకుంఠపురంలో' అనే టైటిల్ ను అనుకున్నారనేది తాజా సమాచారం. ఇదే టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఆగస్టు 15వ తేదీన ఈ విషయంలో స్పష్టత రానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో 'టబు' ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇటీవలే షూటింగులో ఆమె జాయిన్ అయింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
Tue, Aug 13, 2019, 05:34 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View