పెద్ద అల వచ్చి రజనీని లోపలికి లాక్కెళ్లిపోయింది: సీనియర్ నటి సుమిత్ర
Advertisement
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ నటి సుమిత్ర మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. తమిళంలో 'భువన ఒరు కెల్వికురి' అనే సినిమా చేశాను. ఈ సినిమాలో రజనీ .. శివకుమార్ కథానాయకులుగా చేయగా నేను కథానాయికగా చేశాను. ఈ సినిమాలో నన్ను ప్రేమించి మోసం చేసినందుకుగాను రజనీ దగ్గర శివకుమార్ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు.

ఈ సన్నివేశాన్ని కన్యాకుమారి బీచ్ లో ఒక బండరాయిపై తీశారు. మధ్యాహ్నం 12 తరువాత అక్కడ ఉండకూడదని జాలరులు చెప్పారు. కానీ మధ్యాహ్నం 2 గంటలైనా షూటింగు జరుగుతూనే వుంది. అంతలో ఒక పెద్ద 'అల' వచ్చి యూనిట్ అంతటిని కొంత దూరం వరకూ లోపలికి లాక్కెళ్లిపోయింది. అంతా ఈదుకుంటూ బయటికి వచ్చారు .. రజనీ మాత్రం రాలేకపోయారు. దాంతో యూనిట్  సభ్యులు మరింత కంగారు పడిపోయారు. ఈత రాని కారణంగా రజనీ చాలా దూరంలో మునుగుతూ తేలుతూ వున్నారు. దాంతో వెంటనే కొంతమంది ఈదుకుంటూ వెళ్లి ఆయనను బయటికి తీసుకొచ్చారు" అని చెప్పుకొచ్చారు.
Tue, Aug 13, 2019, 04:37 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View