ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ పూర్తిస్థాయి బాధ్యతలు... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!
Advertisement
ఆర్పీ ఠాకూర్ స్థానంలో రాష్ట్ర డీజీపీగా నియమితుడైన గౌతమ్ సవాంగ్ కు పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల అనంతరం ఆర్పీ ఠాకూర్ స్థానంలో వచ్చిన గౌతమ్ సవాంగ్ ఇప్పటివరకు ఇన్ చార్జ్ డీజీపీగానే కొనసాగారు.

అయితే, పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురి పేర్లతో ఓ జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఆ జాబితాను పరిశీలించిన యూపీఎస్సీ కమిటీ ముగ్గురి పేర్లతో తుది జాబితాను తిరిగి ఏపీ ప్రభుత్వానికి పంపగా, ఆ తుది జాబితాలో ఉన్న గౌతమ్ సవాంగ్ ను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1986 బ్యాచ్ కు చెందిన గౌతమ్ సవాంగ్ ఇప్పటివరకు పలు కీలక బాధ్యతల్లో సమర్థంగా పనిచేశారు.
Tue, Aug 13, 2019, 04:17 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View