'సైరా' మేకింగ్ వీడియో రిలీజ్ కి ముహూర్తం ఖరారు
Advertisement
చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' రూపొందుతోంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ కీలకమైన పాత్రను పోషించారు. రేపు ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ మేకింగ్ వీడియో రిలీజ్ కి తాజాగా ముహూర్తం ఖరారు చేశారు.

రేపు మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకి ఈ మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ కూడా మెగా అభిమానులను ఆకట్టుకునేలా వుంది. భారీ బడ్జెట్ తో చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు. ఈ కారణంగానే ఆయా భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగులో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Tue, Aug 13, 2019, 04:03 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View