ఆ షూటింగులో చంద్రమోహన్ సుడిగుండంలో పడిపోయారు: సీనియర్ నటి సుమిత్ర
Advertisement
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన సుమిత్ర, ఆనాటి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. "చంద్రమోహన్ సరసన 'నిజం నిద్రపోదు' అనే సినిమాను చేశాను. ఈ సినిమాలో నా చేతిలోని బ్యాగు గోదావరిలో పడిపోతుంది. ఆ బ్యాగు తీసుకొస్తానని చెప్పి చంద్రమోహన్ గారు గోదావరిలోకి దూకాలి.

అలా చంద్రమోహన్ గారు దూకే సమయానికి అక్కడ సుడిగుండం ఏర్పడింది. చంద్రమోహన్ గారు అందులో దూకేశారు.  అయితే, ఆయన అందులో మునిగిపోతున్నారు. కాపాడమంటూ ఆయన చేయి పైకెత్తారు .. అదంతా యాక్టింగ్ అని చుట్టూ వున్న వాళ్లు అనుకుంటున్నారు. ఆ తరువాత అసలు విషయాన్ని గ్రహించి ఆయనని కాపాడారు. ఈ సంఘటన తరువాత రెండు రోజుల పాటు షూటింగు ఆపేశారు" అని చెప్పుకొచ్చారు. 
Tue, Aug 13, 2019, 03:33 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View