'రణరంగం' హిట్ కొడితే సీక్వెల్ ఖాయం: సుధీర్ వర్మ
Advertisement
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా 'రణరంగం' రూపొందింది. కాజల్ - కల్యాణి ప్రియదర్శన్ నాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

ఈ సందర్భంగా సుధీర్ వర్మ మాట్లాడుతూ .. 'రణరంగం'పై పూర్తి శ్రద్ధ పెట్టి చేశాను .. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందనీ .. శర్వానంద్ కి హిట్ ఇస్తాననే అనుకుంటున్నాను. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. తమ బ్యానర్లోనే మరో సినిమా చేయమని అడుగుతున్నారు. 'రణరంగం' సినిమా హిట్ అయితే తప్పకుండా సీక్వెల్ చేస్తాను. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ నాకు ఒక లైన్ చెప్పాడు .. ఆ లైన్ నాకు బాగా నచ్చింది. 'రణరంగం' విడుదల తరువాత ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది" అని చెప్పుకొచ్చాడు.
Tue, Aug 13, 2019, 03:10 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View