కర్ణాటక వరదబాధితులకు రూ.2 లక్షల విరాళం ప్రకటించిన సంపూర్ణేశ్ బాబు
Advertisement
సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే టాలీవుడ్ నటులలో సంపూర్ణేశ్ బాబు ఒకరు. గతంలో అనేక విపత్తుల సందర్భంగా తన వంతు సాయం అందించిన సంపూ కర్ణాటకలో వరద బీభత్సం చూసి చలించిపోయాడు. వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 లక్షల విరాళం ప్రకటించాడు. ఉత్తర కర్ణాటకలో వరదలు చూసి ఎంతో విచారానికి గురయ్యానని, కన్నడ ప్రజలు తెలుగు సినిమాలపై ఎన్నో దశాబ్దాలుగా ఆదరణ చూపిస్తున్నారని సంపూ పేర్కొన్నాడు. తాను నటించిన హృదయకాలేయం చిత్రం కన్నడ నాట కూడా విజయవంతమైందని, కన్నడిగులు తననెంతో అభిమానిస్తుంటారని తెలిపాడు. ఇప్పుడక్కడి పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని, అందుకే విరాళం అందిస్తున్నానని తెలిపాడు. 
Tue, Aug 13, 2019, 02:45 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View