ధన్సిక భలే ఛాన్స్ కొట్టేసింది!
Advertisement
సాయి ధన్సిక పేరు చెప్పగానే 'కబాలి' సినిమాలో రజనీకాంత్ కూతురుగా .. మాఫియా గ్యాంగ్ కి చెందిన వ్యక్తిగా ఆమె పోషించిన పాత్ర గుర్తుకు వస్తుంది. నటనతో పాటు నాజూకుతనం పుష్కలంగా వున్న ఈ అమ్మాయికి యూత్ లో మంచి క్రేజ్ వుంది. హీరోయిన్ గా సరైన ఛాన్స్ కోసం ఆమె కొంత కాలంగా ఎదురుచూస్తోంది. తాజాగా ఆమెకి అలాంటి ఛాన్స్ దొరికేసింది.

తమిళంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా 'లాబమ్' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా శ్రుతిహాసన్ నటిస్తోంది. మరో కథానాయికగా సాయి ధన్సికను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. విజయ్ సేతుపతి సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. 
Tue, Aug 13, 2019, 01:37 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View