అయిష్టంగానే ఆ సినిమా చేశాను: సీనియర్ నటి సుమిత్ర
Advertisement
ఐదు భాషల్లో 600కి పైగా చిత్రాల్లో సుమిత్ర నటించారు. ఈ ఐదు భాషల్లోను నటిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. తుళు భాషల్లో నేను వరుస సినిమాలు చేస్తూ బిజీగా వుండే దానిని. తెలుగులో 'రామదండు' సినిమాను కన్నడలోను తీశారు.

ఆ సినిమా షూటింగు సమయంలో నాతో కన్నడ డైలాగులు చెప్పించే బాధ్యతను రాజేంద్రబాబు అనే వ్యక్తికి అప్పగించారు. ఆయనతో నేను ప్రేమలో పడటం .. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. ఆ తరువాత దర్శకుడిగా ఆయన చాలా సినిమాలు చేశారు. నా కెరియర్లో అనవసరంగా ఒప్పుకున్నానే అనే సినిమా ఒకటి వుంది .. అదే 'ప్రచండ భైరవి'. ఆ సినిమా మాత్రం అయిష్టంగానే చేశాను" అని ఆమె చెప్పుకొచ్చారు. 
Tue, Aug 13, 2019, 01:14 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View