నీ జీవితాన్ని నాశనం చేస్తా: రాఖీ సావంత్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న మాజీ ప్రియుడు
Advertisement
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవలే రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ ఎన్నారైను ఆమె పెళ్లాడింది. తనకు యూకే వీసా రావాల్సి ఉందని... వీసా రాగానే తన భర్త దగ్గరకు వెళ్లిపోతానని ఆమె ప్రకటించింది.

మరోవైపు, రాఖీ వివాహం చేసుకోవడంతో ఆమె మాజీ ప్రియుడు దీపక్ ఖలాల్ షాక్ కు గురయ్యాడు. దీపక్ ను పెళ్లాడబోతున్నానని కొన్ని నెలల క్రితం రాఖీ సావంత్ ప్రకటించింది. ఆ తర్వాత దీపక్ ను పెళ్లి చేసుకోబోవడం లేదని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇంతలోనే ఎన్నారైను పెళ్లాడింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా దీపక్ ఓ వీడియోను షేర్ చేశాడు. రాఖీ సావంత్ తనకు రూ. 4 కోట్లు ఇవ్వాలని ఈ వీడియోలో డిమాండ్ చేశాడు. నాలుగు రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే... ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని హెచ్చరించాడు.

దీపక్ హెచ్చరికలపై రాఖీ సావంత్ ఘాటుగానే స్పందించింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావని... తన భర్త గురించి తప్పుగా మాట్లాడుతున్నావని మండిపడింది. నీవు నన్నేమీ చేయలేవని తెలిపింది.
Tue, Aug 13, 2019, 12:53 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View