'వాల్మీకి' నుంచి టీజర్ వచ్చేస్తోంది
Advertisement
వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' రూపొందింది. తమిళంలో ఆ మధ్య వచ్చిన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అధర్వ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు.

డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని ఆయన భావిస్తున్నాడు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తెలుగులో అధర్వ మురళి తొలిసారిగా నటించిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.
Tue, Aug 13, 2019, 12:50 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View