తెర వెనుక మీరేం చేస్తారో అందరికీ చూపిస్తాను: నితిన్ కు రష్మిక సరదా బెదిరింపులు
Advertisement
ప్రస్తుతం నితిన్, రష్మిక మందనలు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' సినిమా చేస్తుండగా, వీరి మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సంభాషణ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సెట్స్ లో నితిన్ తో మాట్లాడుతున్న వెంకీ, తమ ఫోటోను ట్విట్టర్ లో పెడుతూ, "నేను, నితిన్‌ అన్న డిస్కషన్‌ లో ఉన్నాం. వెనక కూర్చున్న రష్మిక మాత్రం ఏం చేస్తోందో మాకు తెలీదు" అని కామెంట్ పెట్టాడు.

ఇక దీన్ని చూసిన రష్మిక ఊరికనే ఉంటుందా? "య్‌... సెట్స్‌ లో మీరిద్దరూ ఎవరికీ తెలియకుండా ఏం చేస్తుంటారో చూపించమంటారా? మీ ఫొటోలు బయటపెట్టనా?" అని ఫన్నీగా బెదిరించింది. ఈ సంభాషణ అంతటితో ఆగిపోలేదు. రష్మిక కామెంట్ పై స్పందించిన వెంకీ, "ఏది పోస్ట్‌ చెయ్... మేమిద్దరం ఏం చేసేవాళ్లమో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది" అన్నాడు.

వీరి సంభాషణ మధ్యకు వచ్చిన నితిన్, "సెట్స్‌ లో అయినా, బయట అయినా మేము కేవలం వర్క్ గురించే చర్చిస్తుంటాం. మీరు ఎవరితో మాట్లాడుతుంటారు?" అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన రష్మిక, "ఏయ్‌ నితిన్‌, నువ్వు కాస్త ఆగు. తెర వెనుక ఏం జరుగుతోందో నేను చూపిస్తాను. ఎప్పటికీ మేము సింగిలే అంటుంటారు. ఆ ట్యాగ్‌ లైన్‌ నాకు మాత్రమే సూటవుతుంది" అని ఇంకో కామెంట్ వదిలింది. ఇక వీటిని చూస్తున్న నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
Tue, Aug 13, 2019, 12:41 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View