సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  తాజాగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తెచ్చుకున్న కథానాయిక కీర్తి సురేశ్ ఇప్పుడు తమిళంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని అంగీకరించింది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తాడు. తొలి షెడ్యూలు షూటింగ్ కొడైకెనాల్ లో ప్లాన్ చేస్తున్నారు.
*  సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్టుతో నిర్మించిన 'సాహో' చిత్రం విడుదలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాలలో అదనపు మార్నింగ్ షోలు వేసుకోవడానికి చిత్ర నిర్మాతలు ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతున్నారు. త్వరలోనే అనుమతి రావచ్చని తెలుస్తోంది.
*  మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం ఓ ట్రైన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. అన్నపూర్ణా స్టూడియోలో వేసిన రైలు సెట్లో మహేశ్ సహా ప్రధాన తారాగణం పాల్గొనగా ఈ ఎపిసోడ్ ను పూర్తిచేశారు. ఇది కడుపుబ్బా నవ్వించే కామెడీతో సాగుతుందని అంటున్నారు.

Tue, Aug 13, 2019, 07:40 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View