ఆగస్టు 15న బన్నీ మూవీ టైటిల్ పోస్టర్
Advertisement
అల్లు అర్జున్ తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సంఖ్యా పరంగా అల్లు అర్జున్ కి ఇది 19వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ఈ సినిమా రూపొందుతోందనీ, 'నేను - నాన్న' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే ఇదే టైటిల్ ను ఖరారు చేస్తారా? వేరే టైటిల్ ను సెట్ చేస్తారా? అనేది తెలియదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్టు త్రివిక్రమ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ సినిమాకి ఏ టైటిల్ ను ఖరారు చేస్తారనే అభిమానుల నిరీక్షణకి ఆ రోజున తెరపడనుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
Mon, Aug 12, 2019, 06:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View