మరోసారి విష్ణు విశాల్ తో జోడీ కడుతోన్న అమలా పాల్
Advertisement
తమిళంలో విష్ణు విశాల్ - అమలా పాల్ కలిసి ఆ మధ్య చేసిన 'రాచ్చసన్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టేసింది. ఈ సారి తెలుగులో హిట్ కొట్టిన మరో సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది.

నాని - శ్రద్ధా శ్రీనాథ్ జంటగా చేసిన 'జెర్సీ' వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. విష్ణు విశాల్ - అమలా పాల్ జంటగా తమిళంలో ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి నిర్మాతగా రానా పేరు వినిపిస్తోంది. త్వరలోనే దర్శకుడు ఎవరనే విషయంలో స్పష్టత రానుంది. ఇక హిందీలోనూ 'జెర్సీ' రీమేక్ కి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. 
Mon, Aug 12, 2019, 06:12 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View