అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: హాస్యనటుడు సంపూర్ణేశ్ బాబు
Advertisement
సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా చేసిన 'కొబ్బరి మట్ట' తొలి రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గతంలో తను 'బిగ్ బాస్' సీజన్ వన్ లో పాల్గొన్నప్పటి సంగతులను గురించి ప్రస్తావించాడు. "అసలు నాకు 'బిగ్ బాస్' కార్యక్రమంపై అంతకు ముందు ఎలాంటి అవగాహన లేదు. అయినా నాకు ఇష్టం లేదనే చెప్పాను. వాళ్లు బాగా వత్తిడి చేయడంతో కాదనలేకపోయాను.

నేను ఊహించినట్టుగానే అక్కడ ఉండలేకపోయాను. ఎందుకంటే మా ఇంటికి .. ఊరుకి నేను దూరంగా ఉండలేను. నా గోల భరించలేక వాళ్లు బయటికి పంపించి వేశారు. ఇంటికి వచ్చిన తరువాత నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఇంట్లో నుంచి బయటికి వచ్చేవాడిని కాదు. నన్ను మామూలు మనిషిని చేయడానికి మా వాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అందువలన ఆ విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించను" అని చెప్పుకొచ్చాడు.
Mon, Aug 12, 2019, 04:44 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View