'శంకరాభరణం' కంటే 'సప్తపది' రిస్కీ సబ్జెక్ట్: దర్శకుడు కె.విశ్వనాథ్
Advertisement
తెలుగు తెరపై ఆణిముత్యాల్లాంటి చిత్రాలను ఆవిష్కరించిన దర్శకుడిగా కె.విశ్వనాథ్ కనిపిస్తారు. తాజాగా ఆయన 'విశ్వనాదామృతం' కార్యక్రమంలో 'శంకరాభరణం' .. 'సప్తపది' సినిమాలను గురించి ప్రస్తావించారు.

"నాకు తెలిసి 'శంకరాభరణం' కంటే 'సప్తపది' రిస్కీ సబ్జెక్ట్. ఆ రోజుల్లో 'సప్తపది' వంటి ఒక కథను తెరకెక్కించడం సాహసంతో కూడిన పనే. సనాతనమైన కుటుంబ వ్యవస్థ .. బలమైన వివాహ వ్యవస్థను ఇతి వృత్తంగా తీసుకుని, మనసులకి పెళ్లిగానీ .. మనుషులకు కాదు అనే విషయం చెప్పడం అంత ఆషామాషీ విషయం కాదు. అలాంటి ఒక ప్రక్రియతో ప్రేక్షకులను మెప్పించగలగడం వల్లనే ఆ సినిమా అంతగా జనంలోకి వెళ్లింది. తనకి 'శంకరాభరణం' కంటే కూడా 'సప్తపది' ఎక్కువగా ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావుగారు నాతో తరచూ అంటూ ఉండేవారు" అని చెప్పుకొచ్చారు. 
Mon, Aug 12, 2019, 12:31 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View