ముంబైలో 'సైరా' భారీ ఫంక్షన్.. హాజరు కానున్న చిరంజీవి
Advertisement
చిరంజీవి కెరియర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా 'సైరా' రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అమితాబ్ తో పాటు పలువురు ఇతర భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఈ నెల 14వ తేదీ నుంచి మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ రోజున ఈ సినిమా మేకింగ్ వీడియోను వదలనున్నారు. ఈ నెల 20వ తేదీన ముంబైలో ఒక ఈవెంట్ ను నిర్వహించనున్నారు .. ఈ వేదికపైనే టీజర్ ను రిలీజ్ చేస్తారు. అమితాబ్ .. చిరంజీవి .. విజయ్ సేతుపతితో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ అనంతరం చిరంజీవి విదేశాలకి వెళతారట. తన బర్త్ డే వేడుకను ఆయన అక్కడే జరుపుకోనున్నట్టుగా సమాచారం.
Mon, Aug 12, 2019, 11:38 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View