'చాణక్య'లో ఆ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయట!
Advertisement
గోపీచంద్ కథానాయకుడిగా 'తిరు' దర్శకత్వంలో 'చాణక్య' రూపొందుతోంది. ఇప్పటికే టాకీ పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. గోపీచంద్ సరసన నాయికగా మెహ్రీన్ నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లోని ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. మరో రెండు పాటల చిత్రీకరణ జరిపితే ఈ సినిమా షూటింగు మొత్తం పూర్తయినట్టే.

ఇండో - పాక్ బోర్డర్లో చిత్రీకరించిన సన్నివేశాలు, సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో గోపీచంద్ వున్నాడు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు.
Mon, Aug 12, 2019, 11:09 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View