జగన్ ను ఫాలో అయిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర
Advertisement
ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే విజయవాడలో ఆయన పెట్టుబడుల సదస్సును కూడా నిర్వహించారు. మరోవైపు, స్థానికులకు ఉద్యోగాలను కల్పించే విషయంలో జగన్ ఓ స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో... ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.

మరోవైపు, జగన్ బాటలోనే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర పయనిస్తున్నారు. కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ కన్నడిగులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తన డిమాండ్ పై ఈ నెల 14, 15 తేదీల్లో నిరాహారదీక్షను చేపట్టనున్నట్టు తెలిపారు.
Mon, Aug 12, 2019, 09:26 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View