‘కొబ్బరిమట్ట’తో చాలా హ్యాపీ: హాస్యనటుడు సంపూర్ణేశ్ బాబు
Advertisement
ప్రముఖ హాస్యనటుడు సంపూర్ణేశ్ బాబు నటించిన ‘కొబ్బరిమట్ట’ చిత్రం నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ‘కొబ్బరిమట్ట’ చూసిన ప్రేక్షకులు, ఆయన అభిమానులు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంపూర్ణేశ్ బాబును పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘చాలా హ్యాపీగా ఉంది’ అని అన్నారు. చాలా రోజుల తర్వాత తన సినిమా విడుదలైనా, ప్రేక్షకులు తనను గుర్తుపెట్టుకున్నారని, తమ చిత్రానికి పెద్ద విజయం అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

ఈ చిత్రానికి మంచి విజయం దక్కుతుందని ఊహించామని, తాము ఊహించిన దాని కన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని, అది సంతోషంగా ఉందని చెప్పారు. మామూలుగా అయితే రోజుకు పది నుంచి ఇరవై ఫోన్ కాల్స్ వచ్చేవని, నిన్న, ఇవాళ రెండు, మూడొందల ఫోన్ కాల్స్ వచ్చాయని, సినిమా బాగుందని చెబుతున్నారని అన్నారు.  
Sun, Aug 11, 2019, 08:52 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View