బాలీవుడ్ ఖాన్స్ కు ‘సాహో’ షాకిస్తుందా అన్న ప్రశ్నకు హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement
‘బాహుబలి’ తర్వాత హీరో ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో’ ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ‘సాహో’పై ఇప్పటికే అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈరోజు సాహో చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.  ప్రభాస్, శ్రద్ధా కపూర్, దర్శకుడు సుజిత్, నిర్మాత ప్రమోద్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాహో’ గురించి విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు.

బాలీవుడ్ ఖాన్స్ త్రయం (షారూక్, అమీర్, సల్మాన్) చిత్రాలను డామినేషన్ చేసేలా, వాళ్లకు షాకిచ్చేలా ‘సాహో’ సినిమా ఉండబోతోందా? అన్న ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ, ఖాన్స్ త్రయం తమ చిత్రాల ద్వారా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఇన్ స్పైర్ చేసేశారని అన్నాడు. అందుకని, అలా ఆలోచించడం తప్పు అని చెప్పాడు. బాలీవుడ్, అక్కడి మీడియా తనను చాలా బాగా రిసీవ్ చేసుకుందని, ‘బాహుబలి-1’ తర్వాత బాలీవుడ్ కు చెందిన పెద్ద స్టార్లు తనను ప్రశంసిస్తూ మెస్సేజ్ లు చేశారని గుర్తుచేసుకున్నాడు. ‘సాహో’ లో యాక్షన్ సన్నివేశాలు ఎన్నడూ చూడని విధంగా ఉంటాయని, స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉందని చెప్పాడు.
Sun, Aug 11, 2019, 06:18 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View